మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

పుణె: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..సతారా వద్ద బెంగళూరు-పుణె జాతీయరహదారిపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. పుణె వైపు నుంచి వేగంగా వస్తున్న కారు కాశిల్‌ అనే గ్రామం వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. డ్రైవర్‌తో పాటు మరో చిన్నారి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా కర్ణాటకలోని ధార్వాడ్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *