మోడీ ప్రసంగం వినటానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయనికి వచ్చిన ట్రంప్

అమెరికాలోని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సోమవారం వాతావరణ మార్పులకు సంబంధించిన సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని మోడీ ప్రసంగం వినడానికి ఇక్కడికి వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ తన షెడ్యూలులో ఈ కార్యక్రమం లేకపోయినా కూడా ఈ సమావేశానికి రావటం విశేషం ఆయన సెషన్‌లో ప్రసంగించనప్పటికీ, ప్రధాని మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రసంగాలను విన్నారు. ఇరువురు నాయకుల ప్రసంగాలు విన్న ట్రంప్ ఐరాస ప్రధాన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ, ట్రంప్ స్నేహం ప్రపంచం మొత్తం చూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *