రాహులే అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాం – మల్లు భట్టి విక్రమార్క

దిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం దిల్లీలో ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్‌ గాంధీయే కొనసాగాలని కోరామని టీపీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మూకుమ్మడిగా అంతా ఒకే నిర్ణయాన్ని వెలిబుచ్చినట్టు  ఆయన మీడియాకు వెల్లడించారు. మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని భట్టి విమర్శించారు. ఈ తరుణంలో రాహుల్‌ గాంధీ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీని, దేశాన్ని కాపాడగలరన్నారు. రాహుల్‌ గాంధీయే కొనసాగాలని కోరుతూ నేతలంతా ఏకవాక్య తీర్మానం చేశారని కాంగ్రెస్‌ నేత కుసుమ కుమార్‌ తెలిపారు. 

రాత్రి 8గంటలకు మరోసారి సీడబ్ల్యూసీ భేటీ

మరోవైపు, ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. అధ్యక్షుడి ఎంపిక కోసం నేతల అభిప్రాయాలను సేకరించేందుకు 5 బృందాలను సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 8గంటలకు మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. ఈ భేటీలో నేతల నేతల అభిప్రాయాలను కమిటీలు సమావేశం ముందు ఉంచనున్నాయి. అనంతరం అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *