రిలయన్స్‌ మార్ట్‌లో భారీ చోరీ

గోల్కొండ (హైదరాబాద్‌): నగరంలోని షేక్‌పేట్‌లో ఉన్న రిలయన్స్‌ మార్ట్‌లో భారీ చోరీ జరిగింది. గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌పేట్‌ నాలా వద్దనున్న రిలయన్స్‌ మార్ట్‌లోకి ఈ నెల 10న రాత్రి 9.30 గంటల సమయంలో ఓ వ్యక్తి కొనుగోలుదారునిగా స్టోర్‌లోకి ప్రవేశించాడు. స్టోర్‌ మూసేంతవరకు లోపలే ఓ చోట దాక్కొన్నాడు. దీన్ని గమనించని నిర్వాహకులు ఎప్పటిలాగే రాత్రి 10 గంటల సమయంలో స్టోర్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. స్టోర్‌ మూసేసిన తర్వాత మూడో అంతస్తులోని ఎలక్ట్రానిక్‌ వస్తువుల షోరూంలో 30 మొబైల్‌ఫోన్లను దొంగిలించాడు. రాత్రంతా స్టోర్‌లోనే గడిపిన దొంగ.. మరుసటి రోజు ఉదయం (ఆదివారం) ఫైర్‌ ఎగ్జిట్‌ ప్రవేశ ద్వారం ద్వారా బయటికి వెళ్లిపోయాడు. దొంగిలించిన సెల్‌ఫోన్ల విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్టోర్‌ మేనేజర్‌ ఇస్మాయిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *