లాజిక్ మిస్ అవుతున్న కొంతమంది ప్రొడ్యూసర్స్!

ఈ మధ్య కొందరు టాలీవుడ్ నిర్మాతల తీరు చూస్తుంటే వాళ్ళ సినిమాల్లో లాగే బయట కూడా నిజ జీవితంలో లాజిక్స్ మిస్ అవుతూ మాట్లాడుతున్న సందర్భాలను గమనించవచ్చు. కంటెంట్ లో క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మా సినిమాలు ప్రేక్షకులు చూడటం లేదే అని వాపోవడం కూడా వీళ్ళకే చెల్లింది. అసలు విషయానికి వస్తే  గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయిన టెక్నాలజీ వాడకం మూలాన జనం వెబ్ మీడియా మీద ఆధారపడటం బాగా పెరిగింది.సుప్రసిద్ధ న్యూస్ పేపర్లు ఛానళ్లు సైతం వీటి మీద దృష్టి సారిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ప్రొడ్యూసర్ గిల్డ్ లోని కొందరు సభ్యులు చేసుకుంటున్న కామెంట్స్. ఎంటర్ టైన్ మెంట్ వెబ్ మీడియా కేవలం తాము ఇచ్చే యాడ్స్ మీదే ఆధారపడుతుందని అలాంటిది తమ సినిమాల గురించి నెగటివ్ ఆర్టికల్స్ రివ్యూలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని వాపోతున్నారట.

ఇంతకన్నా సత్యదూరమైన మాట మరొకటి ఉండదు. నిజానికి ఏ వెబ్ మీడియాకైనా నిర్మాతలు ఇచ్చే యాడ్స్ కీలకం కాదు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నప్పుడు వాటికి తగిన ఆదాయం వచ్చేలా ఎన్నో సాధికారిక మార్గాలు ఉన్నాయి. అంతేతప్ప తమకు యాడ్ ఇచ్చారన్న మిషతో రివ్యూలు లేదా కథనాలు ప్రేక్షకుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఇస్తే వాళ్ళు ఒకసారి నమ్మినా తర్వాత దూరమైపోతారు. ఇది రుజువయ్యింది కూడా.

అలా కాకుండా ఏళ్ళ తరబడి కొన్ని వెబ్ సంస్థలు మనుగడ సాగించి టాప్ పొజిషన్ లో ఉన్నాయంటే దానికి కారణం చదువరుల విశ్వసనీయత తప్పించి రెండు మూడు రోజులకు పరిమితమయ్యే యాడ్స్ కాదు. ఇంతా కామెంట్స్ చేస్తున్న  సదరు సభ్యుల్లో అధిక శాతం అసలు ఎప్పుడో సినిమా నిర్మాణం మానేసిన వాళ్ళు కావడం ఫైనల్ ట్విస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *