లారీని ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్‌ వద్ద జాతీయ రహదారిపై  కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన రాకేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నుంచి బాసర ఆలయంలో అక్షరాభ్యాసం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాకేశ్‌ బావమరిది, భార్య, అత్త ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రాకేశ్‌కు కుడి భుజం విరిగింది. రాకేశ్‌ కుమారుడు అభిరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు.

 లారీ దగ్ధం…
 కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారు బలంగా ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంకు పగిలి లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *