వచ్చేనెల 3న ఆండ్రాయిడ్‌ 10 విడుదల

వాషింగ్టన్‌: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌ సంస్థ వచ్చేనెల 3న విడుదలచేసే అవకాశముంది. దీంతో పాటే ఆవిష్కరిస్తారని భావించిన పిక్సల్‌-4 శ్రేణి స్మార్ట్‌ఫోన్లు మాత్రం అక్టోబరులో అందుబాటులోకి రావచ్చని సమాచారం. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న గూగుల్‌ అనుబంధ ఏజెంట్‌ సంస్థ ఫోన్‌ ఎరీనా ఈ వివరాలను వెల్లడించింది. ఆండ్రాయిడ్‌-10 సాఫ్ట్‌వేర్‌తో పిక్సల్‌-3, 3 ఎక్స్‌ఎల్‌, 3ఎ, 3ఎ-ఎక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. పిక్సల్‌ 2, 2-ఎక్స్‌ఎల్‌ ఫోన్లకు మాత్రం ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ సరిపడదని ఫోన్‌ ఎరీనా వర్గాలు చెప్పాయి. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వర్షన్లకు కిట్‌కాట్‌, లాలీపాప్‌ వంటి వివిధ పేర్లు ఇస్తూ వస్తున్న గూగుల్‌ ఇక నుంచి సంఖ్యతోనే కొత్త వర్షన్లను సూచించాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *