వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు.. విజయసాయి రెడ్డి ట్వీట్

అమరావతి: టీడీపీ చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు వేయించారని, పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు నిర్వహిస్తున్నారని, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులని.. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు పెడుతున్నారని టీడీపీపై మండిపడ్డారు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *