వార్ మూవీ రివ్యూ

యాక్షన్ మాత్రమే కాదు, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ 

అహింసా దినోత్సవమైన గాంధీ జయంతి నాడు , రక్తపాతంతో నిండిన  వార్ సినిమా విడుదలైంది. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ స్టార్స్ తో కూడిన ఈ చిత్రం ఎలా ఉంది మరియు ఎందుకు చూడాలి లేదా ఎందుకు చూడకూడదు. ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

చిత్రం: వార్
కళాకారులు: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్, అశుతోష్ రానా
దర్శకుడు: సిద్ధార్థ్ ఆనంద్

వార్ చిత్రం ట్రైలర్ వీడియో విడుదలైనప్పుడు, చాలా మంది నిరాశ చెందారు. కారణం, ఈ చిత్రం యొక్క ట్రైలర్ వీడియోలో, యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగాను మరియు రియాలిటీ పేరిట రణగొణ ధ్వనులు తప్ప ఏమి కనిపించలేదు . మంచి విషయం ఏమిటంటే ఇది సినిమా విషయంలో కాదు. మీరు టిక్కెట్లు కొంటే మీ డబ్బు, సమయం వృథా కాదు.

ఇప్పుడు మీరు సినిమాను ఎందుకు చూడాలి మరియు దానిలో మీరు చూడవలసిన విషయాలు మనం ఇప్పుడు చూద్దాం . ట్రైలర్ చూసేటప్పుడు చాలా మంది మిస్సయేది, ఈ చిత్రం కేవలం యాక్షన్ మాత్రమే కాదు. సస్పెన్స్, థ్రిల్లర్ మరియు మిస్టరీ కూడా ఈ చిత్రం చివరి వరకు ఎన్నో మలుపులు ఉంటాయి మరియు చివరికి క్లైమాక్స్ ముందు సీక్రెట్ రివీల్ అవుతుంది

మీరు ఈ చిత్రం చూసేటప్పుడు మీకు ఎదురైయే ప్రశ్నలు ఏంటంటే:

1. వారి మధ్య వార్ ఎలా జరుగుతోంది?

2. సినిమా చివరిలో ఎవరు గెలుస్తారు?

3. విలన్ హృతిక్-టైగర్ లేదా మరొకరా ?

4. హృతిక్ పాత్ర చనిపోతుందా?

ఈ చిత్రం ఎమోషన్స్ మరియు యాక్షన్ తో కూడిన రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు సస్పెన్స్ కూడిన చిత్రం . సంగీతం సరదాగా ఉంటుంది మరియు పజిల్స్ కూడా. స్క్రీన్ ప్లే చాల వేగంగా పరిగెడుతుంది మరియు కథ యొక్క కోణం మొదటి సన్నివేశంతో మీ మనస్సులో క్లియర్ అవుతుంది. తమాషా ఏమిటంటే, మీరు విలన్‌ ఎవరో తెలుసుకోనేలోపు , ఈ చిత్రం మరొక కోణాన్ని వెళుతూ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

కథ ఏమిటి?

భారత సైన్యం యొక్క ప్రత్యేక మిషన్ను నిర్వహిస్తున్న మేజర్ కబీర్ లుథ్రా (హృతిక్ రోషన్) అనుకోకుండా భారత సైన్యంపై తిరుగుబాటు చేస్తాడు . అంతేకాకుండా సైన్యం నుండి కబీర్ పారిపోయి దేశానికి పెను ముప్పుగా మారతాడు . అటువంటి పరిస్థితిలో, కబీర్ను కనుగొని, అతనిని నిర్మూలించడానికి కల్నల్ లుథ్రా (అశుతోష్ రానా) యొక్క బాధ్యత ఖలీద్ ఖాన్ (టైగర్ ష్రాఫ్) కు సైన్యం ఇస్తుంది. ఖలీద్‌కు మేజర్ కబీర్సైన్యంలో ఉన్నప్పుడు శిక్షణ యిస్తాడు మరియు ఇద్దరికీ ఒకరి బలాలు మరియు బలహీనతల గురించి బాగా తెలుసు.

మనకు షాక్ ఇచ్చే అంశం ఏంటంటే ఖలీద్ తండ్రి ఒక ఉగ్రవాది, అందుకే కబీర్ తన ట్రూప్ లోకి తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాడు. అయితే, ఖలీద్ కబీర్ నమ్మకాన్ని గెలుచుకోవటమే కాకుండా అతను కబీర్ జట్టులో చోటు సంపాదించటం . ఇప్పుడు, అదే ఖలీద్‌కు కబీర్‌ను చంపేయాలని ఆదేశాలు వచ్చినప్పుడు, ఈ ప్రశ్న నిరంతరం మనసులో తిరుగుతూనే ఉంటుంది , దేశం కోసం ప్రాణాలను ఇవ్వగల కబీర్ ఎందుకు కారణం లేకుండా అకస్మాత్తుగా తిరుగుబాటుదారుడిగా మారిపోయాడు.

కబీర్ తిరుగుబాటుకు కారణం ఏమిటి? అతను అకస్మాత్తుగా తన దేశానికి ఎందుకు శత్రువు అయ్యాడు? టైగర్ ష్రాఫ్ ఈ యుద్ధంలో గెలవబోతున్నారా లేదా హృతిక్ రోషన్? కథ యొక్క నిజమైన విలన్ ఎవరు? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం.

స్క్రీన్ ప్లే :

ఈ సినిమాలో స్క్రిప్ట్ చాలా పగడ్బందీగా ఉంటుంది . ప్రతి పాత్ర నేరేషన్ మనల్ని అయోమయంలో పడనివ్వదు . క్లిస్టర్ క్లియర్ గా ఉంటుంది

సంగీతం:
ఈ చిత్రంలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి, కానీ వాటి కంపోజిషన్లు మరియు సాహిత్యం మిమ్మల్ని అలరించేంత అందంగా ఉన్నాయి. కెమెరా పనితనం కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ మిమ్మల్ని కట్టిపడేస్తాయి , హృతిక్-టైగర్ డాన్స్ మొమెంట్లయితే ఇంకా చెప్పక్కర్లేదు మిమ్మల్ని వేరే లోకలికి తీసుకువెళతాయి.

రేటింగ్ :
3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *