విండోస్‌ 10 వాడుతున్నారా?..అర్జెంట్‌గా అప్‌డేట్‌ చేసుకోండి!

మీరు విండోస్‌ 10 వాడుతున్నారా ? అది 1809 అనే పాత వెర్షనా? సిస్టమ్‌ లో వెంటనే చెక్‌ చేసుకోండి. ఒకవేళ మీరు వాడేది పాతవెర్షనే అయితే మీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి.

ఏ వెర్షనైనా అప్‌డేట్‌ తప్పదు !విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో అనేక వెర్షన్లు ఉన్నాయి. విండోస్‌ 10 హోమ్‌ .. విండోస్‌ 10 ప్రో, ఇంకా విండోస్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇలా.. అయితే అయితే ఇక్కడ మాట్లాడేది ఓఎస్‌ వెర్షన్‌ నంబర్ల గురించి కాదు. దాని అప్‌డేట్‌ వెర్షన్‌ నంబర్ల గురించి! ఒక్కోసారి విండోస్‌ అప్‌డేట్‌ అయినప్పుడల్లా నంబర్‌ మారుతూ ఉంటుంది. దీన్ని బిల్డ్‌ వెర్షన్‌ అంటారు. విండోస్‌ 10 సెట్టింగ్స్‌ లోకి వెళ్తే .. విండోస్‌ అప్‌డేట్‌ అనే చోట మీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వివరాలు తెలుస్తాయి. అక్కడే వెర్షన్‌ అప్‌డేట్‌ నంబర్లూ ఉంటాయి. మీరు విండోస్‌ 10 హోమ్‌ లేదా ప్రో ఏది వాడుతున్నా సరే.. ఈ సిస్టమ్‌ అప్‌డేట్‌ తప్పనిసరి. ఆటో అప్‌డేట్‌ అందరూ చేయరు!చాలామంది తమ కంప్యూటర్లోని ఓఎస్‌ ( ఆపరేటింగ్‌ సిస్టమ్‌)ని క్రమబద్ధంగా అప్‌డేట్‌ చేయరు. విండోస్‌ ఆటో అప్‌డేట్‌ సెట్టింగ్‌ పెట్టేసి, అప్‌డేట్‌ చేసే పనిని కంప్యూటర్‌ మీదే పడేస్తారు. కొత్త అప్‌డేట్‌ వచ్చినప్పుడు డౌన్‌లోడ్‌ అయి, ఓఎస్‌ తాలూకు కొత్త బిల్డ్‌ ఆటో ఇన్‌స్టాల్‌ అవుతుంది. కొందరయితే ఆ జాగ్రత్త కూడా తీసుకోరు. అయితే ఆటో ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ వల్ల ఒకసారి పనికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొందరు మాన్యువల్‌ ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌నే ఎంచుకుంటారు. విచారకరమైన విషయం ఏమిటంటే – చాలామంది అసలు కంప్యూటర్‌ పనిచేస్తే చాలనుకుంటారు గానీ… అప్‌డేట్ష్‌ గురించి ఏ మాత్రం పట్టించుకోరు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. విండోస్‌ 10 పాత వెర్షన్లో చిన్న చిన్న లూప్‌ హోల్స్‌ ఉన్నాయి. వాటి ఆధారంగా హ్యాకర్స్‌నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందుకే ఈ అప్‌డేట్‌ తప్పనిసరి! సపోర్ట్‌ మిస్‌ కావద్దు!విండోస్‌ 10 తాలూకు అప్‌డేట్స్‌ పొందకపోయినట్టయితే మరో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే – మీ కంప్యూటర్‌కి మైక్రోసాఫ్ట్‌నుంచి సహజంగా సపోర్ట్‌ అందకపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే – మైక్రోసాఫ్ట్‌ తాజాగా విండోస్‌ 10 పాత వెర్షన్‌కి – 1809 అనే బిల్డ్‌కి – తన సపోర్ట్‌ ని పూర్తిగా ఉపసంహరించుకుంటోంది. అంటే మీరు ఒరిజినల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొన్నప్పటికీ అప్‌డేట్‌ చేసుకోకపోతే – దానివల్ల మీ సిస్టమ్‌కి ఏదైనా సమస్య ఏర్పడినా – మైక్రోసాఫ్ట్‌నుంచి మీకు ఎలాంటి సహాయమూ లభించదన్నమాట! ఇప్పటికీ విండోస్‌ ఎక్స్‌పీ యేనా?గతంలో కూడా విండోస్‌ ఎక్స్‌పీ విషయంలో కూడా ఇలాగే మైక్రోసాఫ్ట్‌ సపోర్ట్‌ ఉపసంహరించుకుంది. దాదాపు పన్నెండు సంవత్సరాలు సపోర్ట్‌ ఇచ్చిన తరవాత – “ఇక కొత్త కొత్త డిజిటల్‌ అవసరాలకోసం విండోస్‌ ఎక్స్‌పీ పనికిరాదు. సెక్యూరిటీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందరూ కనీసం విండోస్‌ 7 వాడండి” అంటూ సపోర్ట్‌ నుంచి వైదొలగింది. అయినప్పటికీ – అలవాటైపోయింది కదా అనుకుని – ఇప్పటికీ అజ్ఞానంతో – విండోస్‌ ఎక్స్‌పీ వాడుతూ సమస్యలు తెచ్చుకునే యూజర్లు ఉండడం విశేషం. 

… తరవాత మేం బాధ్యులం కాదు!కంప్యూటర్‌ భద్రత అనేది ఇదివరకటిమాదిరిగా లేదు. విండోస్‌ ఎక్స్‌పీ, సెవెన్‌ మాత్రమే కాదు, విండోస్‌ 10 పాత వెర్షన్‌ వాడినా సరే.. భద్రతా సమస్యలు ఏర్పడే అవకాశం పుష్కలంగా ఉంది. పాత బిల్డ్‌కి సపోర్ట్‌ అందించాలంటే – సిస్టమ్‌ రక్షణ కోసం ఎప్పటికప్పుడు ప్యాచ్‌లు తయారుచేస్తూ పోవాలి. ఇది చాలా తలనొప్పి వ్యవహారం. ఒకోసారి టెక్నికల్‌‌గా సాధ్యం కాదు కూడా! అందుకే మైక్రోసాఫ్ట్‌ తన పాత బిల్డ్‌కి సపోర్ట్‌ వదిలిపెట్టి – అర్జెంట్‌గా అప్‌గ్రేడ్‌ అవ్వమంటూ యూజర్లను తొందరపెడుతోంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడూ అప్‌డేట్‌‌లో ఉండడం సిస్టమ్‌కి క్షేమకరం! సమాచార భద్రతకి అత్యవసరం. అందుకే వెంటనే అప్‌డేట్‌ అవండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *