విజయవాడలో 100 ఆవుల మృతి

కొత్తూరు: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరో కొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆవులు మృతి చెందడంతో వీటికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. అనంతరం గోవుల మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.మరోవైపు గోశాల నిర్వాహకులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా?ఆ కక్షతోనే విరోధులు ఇలాంటి చర్యకు పూనుకొన్నారా? అనే దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *