విమాన రాకపోకలు రద్దు: హాంకాంగ్‌

హాంకాంగ్‌: ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమాన రాకపోకలను రద్దు చేస్తునట్లు హాంకాంగ్‌ విమానాశ్రయ అధికారులు సోమవారం తెలిపారు. కొన్ని వేలమంది ప్రొ-డెమోక్రసీ నిరసనకారులు విమనాశ్రయాల్లోకి చొచ్చుకొని ‘హాంకాంగ్‌ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదు’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడంతా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ప్రయాణికులు సరైన సౌకార్యాలు కల్పించలేమంటూ విమానాశ్రయ వర్గాలు చేతులెత్తేశాయి. ఇప్పటికే చెక్‌-ఇన్‌ పూర్తయిన విమానాలు మినహాయించి, హాంకాంగ్‌ నుంచే వచ్చే, ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలన్నీ రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. హాంకాంగ్‌ ప్రజలు దయచేసి ఈ రోజు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, విమానాశ్రయాలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. హాంకాంగ్‌ దేశంలో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రొ-డెమోక్రసీ సభ్యులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆ నిరసనల ప్రభావం ఆ దేశ షేర్‌ మార్కెట్‌పై పడి తీవ్ర నష్టాలను చవిచూసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *