వివరాలు రికార్డు చేస్తున్న యాపిల్‌ ‘సిరి’

డబ్లిన్‌: జనం మాటలను అర్థం చేసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకునే యాపిల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌ ‘సిరి’… వినియోగదారుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా రికార్డు చేస్తున్నట్టు, వాటిని సంస్థ ఏజెంట్లు వర్గీకరిస్తున్నట్టు వెలుగుచూసింది. ఐరిస్‌ ఎగ్జామినర్‌ అనే సంస్థ ఈ విషయాన్ని గతవారం వెల్లడించింది. దీంతో సిరి రికార్డింగుల వర్గీకరణను యాపిల్‌ నిలిపేసింది. ‘‘వ్యక్తులు ఇచ్చే ఆదేశాలతో పాటు వారి ఆరోగ్య, ఔషధాల వివరాలు, వ్యాపార రహస్యాలు, శృంగార వ్యవహారాలను కూడా సిరి రికార్డు చేస్తోంది. ‘హే సిరి’ అనే కమాండ్‌ ఇవ్వకపోయినా… కొన్ని సారూప్య శబ్దాలకు సిరి యాక్టివేట్‌ అవుతోంది. ఆ సమయంలో అక్కడి సంభాషణలను అది నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్‌ ఏజెంట్లు వీటిని తరచూ విని, విశ్లేషిస్తున్నారు’’ అని సదరు సంస్థ తన నివేదికలో పేర్కొంది. తమ వినియోగదారుల గోప్యతను పరిరక్షిస్తామని, సిరి రికార్డింగ్‌ల వర్గీకరణ కార్యకలాపాలను నిలిపివేశామని యాపిల్‌ వర్గాలు చెప్పినట్టు ఐరిస్‌ ఎగ్జామినర్‌ ఉటంకించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *