విశాఖలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఘన స్వాగతం

విశాఖ: రెండురోజుల పర్యటన కోసం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మీనా, నేవీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు వచ్చారు.
 ఎయిర్ పోర్ట్ నుంచి రహదారి మార్గంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ట్స్‌కు చేరుకున్నారు. నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ సంజయ్ దత్ ఆయనకు స్వాగతం పలికారు. ఐఎన్ఎస్ డేగకు చేరుకొని యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు బయట నుంచే సందర్శించి అక్కడ నేవీ అధికారులతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *