వైన్ షాపులు వద్దు మొర్రో..అంటున్న జనం

కానూరు పరిధిలోని కామయ్యతోపు పంటకాలవ ఎండోమెంట్స్ కాలనీ రెండో రోడ్డువాసులు మంగళవారం వైన్ షాపు తొలగించాలని ధర్నా చేశారు. మద్యపాన నిషేధం అంటూనే ఇళ్ల దగ్గర, విద్యా సంస్థల దగ్గర వైన్ షాపులు పెట్టటం నిబంధనలకు విరుద్ధమని, వైన్ షాపు తొలగించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు.30మంది వృద్ధులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ ఆధీనంలో తొలిసారి వైన్ షాపు ప్రారంభం కాకుండా అడ్డుకున్నారు. ఎక్సైజ్ సీఐ వాసుదేవరావు, ఎస్‌ఐ శివప్రసాద్ సర్దుబాటుకు ఎంతగా ప్రయత్నించినా స్థానికులు పట్టువీడలేదు. మూడు గంటల పాటు నిరసన కార్యక్రమం కొనసాగింది. వాసుదేవరావు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తాత్కాలికంగా ఈరోజు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *