వైసీపీకి ఓటు వేయకపోతే చంపేస్తారట: టీడీపీ ఎమ్మెల్సీ

విజయవాడ: వైసీపీకి కాకుండా టీడీపీకి ఓటేస్తే చంపేస్తామని కార్యకర్తలను కొందరు బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ బాధితులకు శిబిరం ఏర్పాటు చేశారని.. డీజీపీ, రాష్ట్ర హోంమంత్రి సుచరిత కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైనా జరిగి ఉంటే అప్పుడెందుకు మాట్లాడలేదు..? అని ఈ సందర్భంగా బచ్చుల ప్రశ్నించారు. 200 కార్లతో వెళతాం!పెయిడ్ వర్కర్స్ శిబిరం అన్న మీరు అధికారులను ఎందుకు పంపారు..?. గ్రామాల నుంచి ప్రజలను తరిమేశారెందుకు..?. రేపు మా ‘ఛలో ఆత్మకూరు’ ఉంటే.. ఈరోజు చర్చలు చేస్తున్నారు. హోం మంత్రి నియోజకవర్గంలో గోడ కడితే తీయించలేకపోయారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చాలా చూశానంటున్నారు.. అసలు ఆయన ఏం చూశారో చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి కృష్ణాజిల్లా నుంచి 200కార్లతో వెళతాం’ అని ఈ సందర్భంగా బచ్చుల చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *