శాస్త్రవేత్తలకు మద్దతుగా కోహ్లీ ట్వీట్

న్యూఢిల్లీ: టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇస్రో శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచాడు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో ఆఖరి క్షణాల్లో అవరోధాలు ఏర్పడటంపై స్పందించిన విరాట్.. ‘సైన్స్‌లో పరాజయం అనే మాటకు స్థానం లేదు. మేం ప్రయోగాలు చేస్తాం.. విజయం సాధిస్తాం’ అంటూ పోస్ట్ చేశారు. చంద్రయాన్-2 ప్రయోగం కోసం నిరంతరం శ్రమించిన శాస్త్రవేత్తలను అభినందించిన కోహ్లీ.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *