శ్రీ లింగరాజు ఆలయాన్ని దర్శనం చేసుకున్న గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ గారు

విజయవాడ, సెప్టెంబర్ 22: గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ మూడు రోజుల ఒడిశా పర్యటన సందర్భంగా ఆదివారం ఉదయం భువనేశ్వర్ నందు శ్రీ లింగరాజు ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి గవర్నర్ శ్రీ హరిచందన్ ఒడిశా పర్యటనకు వెళ్లారు. శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పదవి చేపట్టిన సందర్భంగా ఆయన గౌరవార్థం స్థానిక నాయకులు రవీంద్ర మండప్ లో పౌర సన్మానం ఏర్పాటు చేశారు. అంతకు ముందు గవర్నర్ శ్రీ హరిచందన్ స్వాతంత్ర్య సమరయోధులు బక్షి జగబంధు, జై రాజగురు, ఉత్కళ మణి గోపబంధు విగ్రహాలకు పుష్ప మాలలు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *