సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో రౌడీషీటర్‌ దారుణ హత్య

సనత్‌నగర్‌: పాతకక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో ఓ రౌడీషీటర్‌ను దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ సమీపంలోని అల్లాపూర్‌లో నివసించే నర్సింహదాస్‌ గౌడ్‌ అలియాస్‌ పోచి (35) రౌడీషీటర్‌. ఇతనిపై సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌తోపాటు పలు ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి శివాజీనగర్‌ వద్ద సుమారు 20 మంది వ్యక్తులు పోచి వెంటపడి కత్తులు, పలుగు రాళ్లు, గ్రానైట్‌ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *