సీఎం కేసీఆర్.. ఆర్థిక టెర్రరిస్ట్: కాంగ్రెస్ నేత


హైదరాబాద్: 
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కాంగ్రెస్ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దుస్థితికి తీసుకెళ్లారని విమర్శించారు. నేడు రాష్ట్రం ఈ స్థితిలో ఉండటానికి ఆర్థిక టెర్రరిస్ట్ కేసీఆర్ పాలనా విధానాలే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన… చింతమడకలో రూ.10 లక్షలు ఇస్తానన్నప్పుడు ఆర్థికమాంద్యం గుర్తుకు రాలేదా? అని రవి ప్రశ్నించారు. కేంద్రం మీద తప్పును నెట్టి కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే పదవుల పందేరం అని విమర్శించారు. కేసీఆర్ మోసగాడని టీఆర్ఎస్ ముఖ్య నేతలే చెబుతున్నారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మందలించే ధైర్యం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌లోని అసంతృప్తులే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతారని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *