సీపీఆర్వోను బర్తరఫ్ చేయాలి: వీహెచ్

హైదరాబాద్: సీపీఆర్వో ఆర్టికల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గవర్నర్‌ను కించపరిచేలా సీపీఆర్వో ఆర్టికల్ రాశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండానే ఇది జరిగిందా? అని ప్రశ్నించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీపీఆర్వోను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సీపీఆర్వో ఆర్టికల్ బీసీలను కూడా అవమానించేలా ఉందన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్.. కాలనీల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఒక పబ్లిసిటీ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. రైతులు యూరియా అడుగుతుంటే.. ప్రభుత్వం యురేనియం అంటోందని వీహెచ్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *