స్మార్ట్‌గా కంపోజ్‌!

మెసేజ్‌ కంపోజ్‌ చేస్తుంటే కొన్ని పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు టైప్‌ చేసిన పదం లేకపోతే మెషిన్‌ నేర్చుకుంటుంది. ఇంకోసారి ఆ పదం టైప్‌ చేయాలనుకున్నప్పుడు సజెషన్‌ చేస్తుంది. ఇలా ప్రతిసారి కొత్తపదాలను నేర్చుకుంటూ ఉంటుంది. ఈ తరహా ఫీచర్‌ను ఇటీవల జీమెయిల్‌లో ‘స్మార్ట్‌ కంపోజ్‌’ పేరుతో ప్రవేశపెట్టింది. మరింత సులభంగా మెయిల్‌ టైప్‌ చేసుకునేందుకు ఇది దోహదపడనుంది. జీమెయిల్‌ వెబ్‌ వెర్షన్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ ఉంది. తాజాగా ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో అప్‌డేట్‌ చేసింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే లేటెస్ట్‌ వెర్షన్‌ జీమెయిల్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉండాలి. జీమెయిల్‌ యాప్‌ అప్‌డేట్‌ చేసిన తరువాత ఓపెన్‌ చేశాక న్యూ మెయిల్‌ కంపోజ్‌ చేసే సమయంలో స్మార్ట్‌ కంపోజ్‌కు సంబంధించిన పాప్‌-అప్‌ ఆటోమెటిక్‌గా కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి జీమెయిల్‌ యాప్‌ ఓపెన్‌ చేసిన తరువాత స్ర్కీన్‌ బాటమ్‌లో కుడివైపు కార్నర్‌లో ఉన్న ‘+’ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. స్మార్ట్‌కంపోజ్‌ పాప్‌-అప్‌ను డిస్‌మిస్‌ చేసి టైపింగ్‌ చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ ఫీచర్‌ను సెట్టింగ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి యాక్టివేట్‌, డీయాక్టివేట్‌ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *