స్వతంత్ర భారతం అన్న మాట పరిపూర్ణమైంది: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే హర్షం వ్యక్తంచేశారు. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర భారతం అన్న మాట ఇవాళ పరిపూర్ణమైందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో దివంగత నేతలు వాజ్‌పేయీ, బాల్‌ ఠాక్రే స్వప్నం నెరవేరినట్టయిందన్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *