హెచ్చరిక.. డెంగీ లక్షణాలుంటే ఆ టాబ్లెట్లు వేసుకుంటే ముప్పే

  • ఆస్పిరిన్‌ వేసుకుంటే ముప్పే
  • అపోలో ఆస్పత్రుల ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌

హైదరాబాద్‌ సిటీ: డెంగీ లక్షణాలుంటే ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ వేసుకుంటే ముప్పేనని అపోలో ఆస్పత్రుల ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌ హెచ్చరించారు. అపోలో ఆస్పత్రి అంతర్జాతీయ సదస్సు గురించి  ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డెంగీ తీవ్రతపై స్పందించారు. కొన్ని ఆస్పత్రులు, రోగి స్వయంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. డెంగీ లక్షణాలు తెలుసుకోకుండా మందులు వేసుకుంటే అది ప్రాణాంతకంగా మారుతుందన్నారు. జ్వరం రాగానే కొంతమంది వైద్యుల సలహాలు తీసుకోకుండా మెడికల్‌ దుకాణానికి వెళ్లి మందులు తీసుకొని వాడుతున్నారని, అలా చేయవద్దని సూచించారు. ప్రజల్లో చాలామందికి అవగాహన పెరిగిందనీ, అనుమానంతో డెంగీ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రస్తుతం డెంగీ పరీక్ష చేయించుకుంటే ఒక్కరోజులోనే రిపోర్టు వస్తుందని ఆయన చెప్పారు. జ్వరం తీవ్రంగా ఉంటే డెంగీ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందడం మంచిదని హరిప్రసాద్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *