20న జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-2

అహ్మదాబాద్‌: చంద్రుడి మీద దిగేందుకు భారత్‌ తొలిసారిగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 వ్యోమనౌక ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. వచ్చే నెల 7న చందమామ ఉపరితలంపై కాలుమోపుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ సోమవారం ఇక్కడ చెప్పారు. విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన అహ్మదాబాద్‌ వచ్చారు. 3850 కిలోల బరువున్న చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి. ఈ వ్యోమనౌకను గత నెల 22న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *