త్వరలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్న ఇస్రో

భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో తన రెండవ మూన్ మిషన్ చంద్రయాన్ -2 విక్రమ్ లాండర్ ఫెయిల్ అయిన తరువాత నిరుత్సహం చెందకుండా కొత్త ప్రయాగాలను ప్రారంభించింది . అదే ఏంటంటే ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే సాధ్యమయిన అంతరిక్ష కేంద్రన్నీ సృష్టించడానికి సమాయత్తం అవుతుంది . దానికి కావలిసిన ఆర్ధికవనరులను మోడీ ప్రభుత్వం సమకూర్చటం విశేషం. ఈ ప్రాజెక్టుకి షుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చుఅవుతుందని ఇస్రో చీఫ్ డాక్టర్ కె. శివన్ తెలియచేసారు . ఈ మిషన్ చాలా క్లిష్టమైనదని . దీనికి చాల సామర్థ్యం అవసరమని ఆయన అన్నారు . అంతరిక్ష కేంద్రం సృష్టించడానికి, రెండు అంతరిక్ష నౌకలను లేదా ఉపగ్రహాలను అనుసంధానించడం చాలా ముఖ్యమని , అవి ఇటుకకు ఇటుకను కలుపుతున్నట్లు ఏర్పాటుచేయాలని అది చాలా క్లిష్టమైనదని ఆయన అన్నారు . , ఈ మిషన్‌లో అతిపెద్ద సమస్య ఏమిటంటే రెండు ఉపగ్రహాల వేగాన్ని తగ్గించి వాటిని అంతరిక్షంలోకి చేర్చడం. సరైన మొత్తంలో వేగం తగ్గించకపోతే, అప్పుడు అవి తమలో తాము ఢీ కొంటాయి . ఈ మిషన్ పేరు స్పాడెక్స్ అనగా స్పేస్ డాకింగ్ ప్రయోగం అంటారు

ఇస్రో చీఫ్ డాక్టర్ కె. శివన్ మాట్లాడుతూ ఈ మిషన్ చేయడం అంటే ఇస్రో యొక్క అంతరిక్ష కేంద్రం మిషన్ ప్రారంభమైందని కాదని , గగన్యాన్ యాత్ర తరువాత మాత్రమే ప్రారంభించబడుతుందని . ఎందుకంటే మానవులను అంతరిక్షంలోకి పంపిన తరువాత మరియు పర్ఫెక్ట్ డాకింగ్ చేసిన తరువాత మాత్రమే అంతరిక్ష కేంద్రం మిషన్ ప్రారంభించవచ్చని ఆయన అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *