20 సంవత్సరాల తర్వాత కలవనున్న కాంగ్రెస్-ఎన్‌సిపి…? విలీనం జరగపోతుందా ?

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే సంచలన ప్రకటన చేసారు . భవిష్యత్తులో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కలిసి వస్తాయని షిండే ఆశాభావం వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్, ఎన్‌సీపీ తనకు రెండూ సమానమే’ అని… మేమిద్దరం కాంగ్రెస్ అనే చెట్టు కింద పెరిగామని ఆయన సోలాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు . కానీ శరద్ పవార్ దీనిని అధికారికంగా ఖండించారు. అయితే, దీని తరువాత, రెండు పార్టీలు కలిసి రావాలని కాంగ్రెస్ భావిస్తోందని పవార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే జరిగితే మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోవటం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *