వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలముఠా ఆట కట్టించిన వనపర్తి పోలీసులు

వనపర్తి జిల్లా కేంద్రంలో తరచుగా జరుగుతున్న దొంగతనాలు నివారించడంలో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె,అపూర్వరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేరస్తుడు సయ్యద్ మహమూద్ పాషా అలియాస్ బిర్యాని పాషా ని సోమవారం ఉదయం వనపర్తి పట్టణంలోని శంకరుగంజిలో ప్రత్యేక సిబ్బంది టీం అదుపులోకి తీసుకుని,వనపర్తి పట్టణ పోలీస్టేషనులో తరలించి విచారించగా అతను వనపర్తి 6 దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నారు అతని వద్ద నుండి 5 లక్షల 33వేల విలువైన,14 తులాలబంగారం ,30తులాల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు వనపర్తి డీఎస్పీ శ్రీమతి సృజన గారు మీడియాకు తెలియచేసారు . ఇందులో నేరస్థుడు వివిధ రకాల నేరాలు చేయడంలో కరడు గట్టిన నేరస్థుడుగా వేర్వేరు 96 దొంగతనాల నేరాలలో నిందితుడిగా జైలుకు వెళ్లి, బయటకు వచ్చి తిరిగి దొంగతనాలకు పాల్పడ్డారని డీఎస్పీ గారు వెల్లడించారు.
పోలీసు శాఖ వినియోగిస్తున్న ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా, నేరస్తునిపై నిఘా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి వెల్లడించారు.
నిందితుడు దగ్గర బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరచుకొని జ్యుడిషియల్
రిమాండ్ నిమిత్తం కోర్టులోహాజరు పరుచనున్నట్లునట్లు డిఎస్పీ సృజన గారు గారు తెలిపారు . ఈ కేసును చేదించడంలో సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు ఛేదనలో వనపర్తి సీఐ,
సూర్య నాయక్, వనపర్తి పట్టణ ఎస్సై నరేందర్, శిక్షణ ఎస్సై, ఉమా కానిస్టేబుల్ కండేదశరథం, తిరుపతిరెడ్డి, గంగోజి, సందీప్, శ్రీనివాసులు, హోంగార్డు రామచందర్ ఉన్నారు. వీరిని డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *