సాగర్‌ 21 గేట్ల ఎత్తివేత

వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇవాళ ఉదయం నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లను ఎన్ ఎస్సీ అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు, ఆ తర్వాత మరో మూడు గేట్లను ఎత్తారు. అనంతరం ఇప్పుడు 21 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్‌కు ఇంత భారీగా వరద రావడం 2009 తర్వాత ఇదే తొలిసారి. ఇన్‌ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 556 అడుగులుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *