అవకాశాలను అందిపుచ్చుకోవాలి యువతకు నిరంజన్ రెడ్డి పిలుపు…

యువత అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ఖాళీగా ఉండకుండా ప్రభుత్వ ,ప్రైవేట్ ఏ రంగంలో అవకాశం వస్తే ఆ రంగంలో చేరిపోవలన్నారు.
సోమవారం ఆయన వనపర్తి జిల్లా కొత్తకోట బీపీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన జాబ్ మేళా కు ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు.పట్టుదలతో కృషి చేస్తే సాదించలేనిదేది లేదని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక లక్ష 25 వేల మందికి ఉద్యోగా లిచ్చామని,చెప్పారు.ఉమ్మడి రాష్ట్రంలో హైద్రాబాద్ లో 3.4 లక్షల ఐటీ ఉద్యోగాలుండగా,రాష్ట్రం వచ్చాక ఇది ఆరు లక్షలకు పెరిగిందన్నారు.గతంలో విద్యుత్ సమస్యవల్ల మూత పడిన 10 వేల పరిశ్రమలకు అనుమతులి చ్చామని తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేట్ ,సేవల రంగం ద్వారా యువత ఉద్యోగాలు పొందవచ్చని,యువతులుకుడా వివక్ష లేకుండా అన్ని ఉద్యోగాలలో చేరాలని కోరారు.పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడటం మానివేయలని,పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందేందుకు ప్రతిభ,ఆత్మ విశ్వాసం,కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమని తెలిపారు.వివిధ కంపెనీలలో ఉద్యోగం పొందినవారు జాబ్ నిలుపుకునేందుకు కృషి చేయాలన్నారు. దేవరకద్ర శాసన సభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించాలన్న కసి ఉంటే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందన్నారు.వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవలన్నారు.గతంలో నియోజకవర్గంలో 750 మంది నిరుద్యోగ యువతకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు.
జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష్యులు వామన్ గౌడ్,ఎంపిపి మౌనిక, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష్యులు రాములు,వివిధ కంపెనీల హెచ్ ఆర్ లు మాట్లాడారు. ఈ జాబ్ మేళా కు సుమారు 20 కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. 2100 మంది నిరుద్యోగులు జాబ్ మేళా కు హాజరు కాగా 1150 మంది ఉద్యోగాలు పొందారు. ఈ సందర్బంగా 11 మందికి మంత్రి, కలెక్టర్,ఎం ఎల్ ఏ లు స్వయంగా నియామక ఉత్తర్వులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *