తిరుగుబాటు చేస్తాం… రేవంత్ రెడ్డి

యురేనియం తవ్వకాలు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. అమ్రాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పచ్చని అడవులు, కృష్ణా నది, ఆదిమ జాతి చెంచులు, వన్యప్రాణులు, ఔషద మొక్కలు ఉన్న ప్రదేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు ఆమోదం తెలుపడం ద్వారానే నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం కేంద్రం అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ తవ్వకాల మూలంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో 1000 టీఎంసీల సాగు నీరు కలుషితం కావడంతోటి కోటి ఎకరాలలో సాగవుతున్న పంటలు దెబ్బ తింటాయని . యూరేనియం తవ్వకాలకు అనుమతులిచ్చిన టీ ఆర్ ఎస్, బీజేపీ పార్టీలను సాంఘిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీల వారితో ఎలాంటి బంధుత్వాలు కూడా కొనసాగించరాదని అన్నారు. రెండు పార్టీలను దోషులుగా నిలబెట్టడం ద్వారానే యురేనియం తవ్వకాలు నిలిచిపోతాయని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇక్కడ కాకపోతే ఎక్కడైన పోయి బతుకుతాడని చివరికి కేసీఆర్ ఫాం హౌజ్‌లో పాలేరుగా పనిచేసి అవకాశం ఉందని తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *