కాశ్మీర్ లో ఆలయాలు తెరిపిస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జమ్ము-కాశ్మీర్‌లో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే అక్కడ ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుతం అక్కడ 50 వేల ఆలయాలు మూతబడ్డాయని, వీటిని తెరిపించేందుకు సర్వేకు ఆదేశించామని చెప్పారు. సోమవారం బెంగళూరు ఆయన కొత్త చట్టాలపై సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్‌ వ్యాలీలో సినిమా థియేటర్లు కొన్ని సంవత్సరాలుగా మూతబడివున్నాయని, వాటిని తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఇందుకోసం ఓకమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. నివేదిక వచ్చాక, తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కొన్ని ఆలయాలు 90శాతం ధ్వంసమైనట్లు సమాచారం ఉందని దీనిపైనా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *